కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటూ సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం కల్లూరు మండలం కేకే భవన్‌లో హమాలీ యూనియన్ మహాసభ జరిగింది. హమాలీ కార్మికులు జీవనోపాధి కోసం కష్టపడుతున్నా, వారికి తగిన వేతనం, భద్రత లభించడం లేదని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ఎన్నికలు కూడా జరిగాయి.