ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామని అధికారులు ప్రజాప్రతినిధులు మరియు ప్రజలతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రమాణం చేయించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యం బారిన పడతామని ప్రజలు కాబట్టి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.