ప్రకాశం జిల్లా సింగరాయకొండ జనసేన పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ఇన్ ఛార్జ్ రాజేష్ శుక్రవారం కూటమి పార్టీల మహిళా కార్యకర్తలకు చీరలను పంపిణీ చేశారు. శ్రావణమాసం పురస్కరించుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రంతో కూడిన సంచిలో చేరని పొందుపరిచి మహిళలకు బహుమతిగా చీరలు పంపిణీ చేసినట్లు ఇన్ ఛార్జ్ రాజేష్ తెలిపారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం, ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పించిందన్నారు.