రైతులకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బిజెపి ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రీ నాయక్,కిసాన్ మోర్చా అధ్యక్షులు బి.గోపాల్ డిమాండ్ చేశారు. గురువారం జన్నారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా బస్తాలు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. పంటలకు ఎరువులు వేసే సమయం ఆసన్నమైందని యూరియా బస్తాలను అందించాలన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు.