సోంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అడివి చెరువు గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను మీ గ్రామంలో చెత్త సేకరించుటకు రోజు వస్తున్నారా, లేక వారానికి ఒకసారి వస్తున్నారా, ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారని తదితర సమస్యల గురించి ఆరా తీశారు. గ్రామపంచాయతీ పరిధిలో చెత్త సేకరణ ప్రతినిత్యం జరిగే విధంగా చూడాలని దీనికి సంబంధించిన అధికారులు తరచుగా పర్యవేక్షణ చేయాలని అలసత్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ తెలియజేశారు.