ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు పదిమందికి స్వల్ప గాయాలైన సంఘటన తెలిసినదే. గాయపడిన వారిని మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిలో మున్నిషా చికిత్స పొందుతూ మృతిచెందగా మరొకరు లక్ష్మీదేవి ని అత్యవసర చికిత్స నిమిత్తం ఒంగోలు తరలిస్తుండగా మృతి చెందినట్లుగా డాక్టర్ వెల్లడించారు.