రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస తనిఖీలలో భాగంగా గురువారం మధ్యాహ్నం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పరిశీలించారు. సిసిటివి పనితీరు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. ఇవియంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశిస్తూ ఈ.వి.ఎం గోడౌన్ పరిశీలించినట్లుగా విజిటర్స్ బుక్ లో సంతకం చేశారు.ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ షేక్.ఖాజావలి, గుంటూరు ఆర్డీఓ కె.శ్రీనివాస రావు పలువురు అధికారులు పాల్గొన్నారు.