మద్యం మత్తులో ఓ వ్యక్తి విచక్షణ రహితంగా బైక్ నడుపుతూ పలువురికి తీవ్ర గాయాలు చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి 9గంటలకు నగరం లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోతిరాంపూర్ కు చెందిన ఓ వ్యక్తి మధ్యం సేవించి కరీంనగర్ నుంచి రేకుర్తికి బైక్ పై అతి వేగంగా వచ్చి రేకుర్తి వద్ద ఇండియన్ పెట్రోల్ బంకు ఎదురుగా ఇద్దరి వ్యక్తులను ఒక కారుని వెనుకనుండి ఢీకొట్టి కింద పడటంతో తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించి..గాయాలైన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.