అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు గౌరవ వేతనం కాకుండా, కనీసం వేతనం ఇవ్వాలని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్. శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. రైల్వే కోడూరు ఐసిడిఎస్ ఆఫీసు వద్ద గురువారం సాయంత్రం నాలుగు గంటలకి, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అనంతరం సిడిపిఓ కి వినతి పత్రం సమర్పించారు.