మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ ఉమ్మడి జిల్లా,పెదగంట్యాడ మండల శివారులో ఉన్న అప్పికొండ సోమేశ్వర క్షేత్రం ముస్తాబవుతోంది.దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో రాతి కట్టడాలు భక్తులకు మంత్రముగ్దులను చేస్తున్నాయి.చోళ రాజుల కాలం నాటి ఈ మహిమాన్విత ఆలయం ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా పేరొందింది.సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న ఈ ఆలయం చరిత్ర వింటే భక్తులు పరవశించి పోతుంటారు.మూల విరాట్ ను దర్శించుకుంది ఎందుకు ఉత్తరాంధ్ర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరవుతారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతున్నాయి.