డిప్యూటీ సీఎం ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'OG' సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. థియేటర్ల వద్ద సాయంత్రం నుంచి అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. తాడిపత్రి ఎస్ఎల్ఎన్ థియేటర్ వద్ద యువత బాణసంచా పేలుస్తూ, పేపర్లు చల్లుతూ హంగామా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కటౌటు పాలాభిషేకం చేశారు. పోలీసులు థియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.