నిజాంసాగర్ మండలంలో వర్షం దంచి కొట్టింది. మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. రెండు రోజుల పాటు ఆగిపోయిన వర్షాలతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు మళ్ళీ వర్షాలు మొదలవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో మంజీర వాగు పరివాక ప్రాంతం ఎప్పుడు ముంపుకు గురతుందోననే భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.