బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మేను విజయవంతం చేయాలని సీఐటీయూ ఉపాధ్యక్షుడు పాలడుగు సుధాకర్ పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చంద్రశేఖర్ ఉన్నారు