ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ద్వారా రైతులకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. ఇందిరా మహిళా కింద ముస్తాబాద్ మండల కేంద్రంలోని శుభోదయం గ్రామైక్య మహిళా సంఘం వారిచే ఏర్పాటు చేసిన నూతన ఎరువుల దుకాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అంద