మద్నూర్ 161 జాతీయ రహదారిపై దారి దోపిడీ మద్నూర్ 161 రహదారిపై దారి దోపిడీ చేసి ఆరున్నర తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు. శనివారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఎల్లాగౌడ్ తల్లి సత్యమ్మ తో కలిసి బైక్ పై మద్నూర్ వెళ్తున్నారు. పిట్లం నుండి బైక్ పై ఫాలో అవుతున్న ఇద్దరు దుండగులు మద్నూర్ కు సమీపంలో కత్తితో దాడి చేసి సత్యమ్మ మెడలో నుండి ఆరున్నర తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. కేసు నమోదు చేసిన మద్నూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.