భూపాలపల్లి నియోజకవర్గంలోని గోరికొత్తపల్లి మండలం చిన్నకోడపాక శివారులో జక్కుల మహేందర్ అనే రైతు తన పంట పొలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నట్లు బుధవారం ఉదయం 11 గంటలకు తెలిపారు. ప్రజలు తమ అభిమాన నాయకుల పై రకరకాలుగా అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు,కొందరు రాజకీయ నాయకులను మరికొందరు సినిమా హీరోలను ఆరాధిస్తుంటారు,అయితే రైతు మహేందర్ మాత్రం తన అభిమానాన్ని కొత్తదనం జోడించి తన పొలంలో ప్రధాని మోదీ పెద్ద కటౌట్ ఏర్పాటు చేశాడు అటుగా వెళ్లే రైతులు ఇతర ప్రయాణికులు చూసి పంట పొలాల్లోకి చేరిన అభిమానం అంటూ చర్చించుకుంటున్నారు.