రైతుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని శాసనసభ ప్రాంగణంలో బిజెపి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో ప్రజలంతా కష్టాల్లో ఉంటే శాసనసభలో నష్టం పై చర్చించకుండా ఇతర బిల్లులపై చర్చించడం ఏంటని ప్రశ్నించారు. ముధోల్ నియోజకవర్గం లో గతంలో ఎన్నడు లేని విధంగా భారీ వరద వచ్చిందని, బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం గోదావరి నది ఉగ్రరూపంతో నిండా మునిగిందన్నారు. నియోజకవర్గంలో 16 గ్రామాలకు పైగా నదీ పరివాహక ప్రాంతాలేనని రై తాంగానికి ఎన్నడ