తిరుపతి జిల్లా నాయుడుపేట లో జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి మలయకోట వద్ద బ్రిడ్జి నిర్మాణం కారణంగా ప్రధాన రహదారిని అధికారులు మూసివేశారు దీంతో మంగళవారం నాయుడుపేట - మల్లం రహదారిపై రాకపోకలను దారి మళ్ళించారు వాహనదారులు కొత్తగా ఏర్పాటు చేసిన మార్గంలోనే ప్రయాణించాలని అధికారులు సూచించారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నాయుడుపేట నుంచి మల్లం వైపు వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం కోసం వాహనాలను దారి మళ్లించారు. అయితే ఇక్కడ డివైడర్ ఏర్పాటు చేసినప్పటికీ వాటికి రాత్రి సమయంలో ప్రకాశించే స్టిక్కర్లు అతికించడం అధికారులు మరిచారు. దీంతో రాత్రి సమయంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.