వాంకిడి మండలంలో భారీ వర్షం కురిసింది. గురువారం సాయంత్రం వాంకిడి మండలంలోని పిప్పర్ గొంది గ్రామం వద్ద కురిసిన భారీ వర్షానికి పిప్పర్ గొంది వాగు పొంగిపొర్లింది. దీంతో పిప్పర్ గొంది గ్రామానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాఠశాలలకు వెళ్ళిన విద్యార్థులకు, వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు కురిసిన భారీ వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.