సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూరు నారింజ ప్రాజెక్టు ఎమ్మెల్యే మాణిక్ రావు సందర్శించారు. గత మూడు రోజులు కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు ఉతృతంగా ప్రవహిస్తూ నారింజ నిండుకుండలా మారింది. దీనితో అధికారులు ప్రాజెక్టు నుండి దిగువకు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రభావం అధికంగా ఉన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం మధ్యాహ్నం నారింజ సందర్శించి అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ప్రవాహాన్ని నీటి పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల ప్రమాదంగా ఉండాలని సూచించారు.