గుంటూరు లోని ఓ ప్రెవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వినుకొండ నియోజకవర్గం అన్నవరం గ్రామం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకట ప్రసాద్ కుటుంబాన్ని ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పరామర్శించి అనంతరం మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడటం జరిగింది. డాక్టర్ని అడిగి వెంకటప్రసాద్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పేర్కొన్నారు. వెంకట ప్రసాద్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తామని గోపిరెడ్డి తెలిపారు. ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని కచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.