నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోందని ఆదివారం ఉదయం ప్రాజెక్టు అధికారులు తెలిపారు.దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు ఒక్క గేట్ ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నరు.ఇన్ ఫ్లోగా ప్రాజెక్టు లోకి 1336 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు ఒక్క గేట్ ఎత్తి అవుట్ ప్లోగా 3892 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 4.699 టీఎంసీలు కాగ ప్రస్తుత నీటి మట్టం 697.700 అడుగులు 4.132 టీఎంసీలలో నీటి సామర్థ్యం కొనసాగుతుంది.