అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రతతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని బేతంచర్ల మండల ప్రత్యేక అధికారి బశీరునిసా బేగం, తహశీల్దార్ నాగమణి, ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ అన్నారు. శనివారం స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా పట్టణ పురవీధుల్లో ఉన్న నగర పంచాయతీ కమిషన్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.