ASF జూబ్లీ కూరగాయల మార్కెట్ కు కోట్లాది రూపాయలు బురదపాలే. అడుగు తీసి అడుగు వేస్తే మడుగును తలపిస్తోంది. సాధారణ రోజుల్లోనే మార్కెట్లో చెత్తాచెదారంతో ఉంటుందని DFYI జిల్లా కార్యదర్శి కార్తీక్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జూబ్లీ మార్కెట్ కు వివిధ మండలాలు,గ్రామాల నుంచి కూరగాయల వ్యాపారులు వస్తుంటారు.మార్కెట్ లో సరైన సౌకర్యాలు లేక వ్యాపారస్తులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మార్కెట్ ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిల్వ ఉంటుందన్నారు. దీంతో రహదారి మొత్తం బురదమయంగా మారిందన్నారు. GP అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.