కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కొండాపురం మండలం కొండాపురం రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం కన్యాకుమారి నుంచి పూణే వెళ్తున్న జయంతి ఎక్స్ప్రెస్కు రైలుకు స్టాపింగ్ ఇవ్వడంతో ప్రయాణికులు పూజలు చేసి స్వాగతించారు.గతంలో కరోనా రావడంతో ఈ రైలుకు స్టాపింగ్ రద్దు చేశారు. తిరిగి హాల్టింగ్ ఇచ్చారు. నేడు కన్యాకుమారి నుంచి పూణే వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకు కొండాపురంలో స్టాపింగ్ ఇవ్వడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.