జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని వెంగళరావు నగర్ డివిజన్ లోని జవహర్ నగర్ లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి అధికారులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తాగునీటి సమస్య ఉందని డ్రైనేజీ సమస్య ఉందని కార్పొరేటర్ కు తెలిపారు. వెంటనే అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యకు పరిష్కారం చూపిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.