హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి వినాయక నవరాత్రులు. విఘ్నాలు హరించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. వీధుల్లో మండపాలను నిర్మించి, ఎవరికి వారే తమ ప్రత్యేకతను చాటుకోవడానికి వివిధ రూపాలలోని గణేష్ విగ్రహాలను కొలువుదీర్చుకొని పూజిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండేందుకు పర్యావరణ హితమైన గణపతులను పూజించడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వినూత్న గణపయ్య కొలువుధీరాడు. సిరిసిల్ల పట్టణం 36వ వార్డు వెంకంపేట రాంలాల్ మండప్ నిర్వాహకులు స్పటిక లింగాలతో వినాయకుడి విగ్రహాన్ని ఏ