రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన వన్నూరస్వామి అనంతపురం జాతీయ రహదారిపై గోల్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆటో రిపేరి చేయించుకోవడానికి అనంతపురం వెళ్లి బుధవారం అర్ధరాత్రి తిరిగి ఆటోలో వస్తుండగా బొలెరో డీకొనింది. తీవ్రంగా గాయపడిన వన్నూరస్వామి అక్కడికి మృతి చెందాడు. ఇదే ఆటోలో వస్తున్న అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.