అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం గోరి దిండ్ల తాండ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ పొలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరు వర్గాల వారు కొడవళ్ళు కట్టెలు రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.