పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, అచ్చంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. MLA శంకరరావు జ్యోతి రావు పులే చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.