Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 25, 2025
రంపచోడవరం ఏజెన్సీలో గిరిజన పాఠశాలలలో చదువుతున్న 50 మంది బాల బాలికలను ఎంపిక చేసి సూపర్ 50 ప్రోగ్రాం ద్వారా ప్రత్యేక క్లాసులు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం పేర్కొన్నారు. సోమవారం రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో సూపర్ 50 ప్రోగ్రాం ద్వారా ఎంపిక చేసే విద్యార్థులకు రిటర్న్ టెస్ట్ కార్యక్రమాన్ని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు పరిశీలించారు.