శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి హర్షియా రాష్ట్రస్థాయిలో జరుగుతున్న మహిళ టి20 జట్టుకు ఎంపికయ్యారు. విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు జరుగుతుండగా నాలుగు జట్లు ఇందులో తలపడనున్నాయి. అయితే హర్షియా తుంగభద్ర దివాస్ జట్టు తరఫున పోటీల్లో పాల్గొన్ననున్నారు. క్రీడాకారిణి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అభినందించారు.