రాష్ట్ర ప్రభుత్వ సూపర్ సిక్స్ లో భాగంగా ముఖ్యమంత్రి ఆగస్టు 15న ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శాసన మండలిలో వివరించారు.మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని డిపోల వద్ద స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనడంతో పథకం ఘనంగా ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు, ఆర్టీసీ అధికారుల సమన్వయం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పథకం సజావుగా కొనసాగుతోందని చెప్పారు.గతంలో సుమారు 40 శాతం మహిళలు మాత్రమే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రయా