పాలనలో పారదర్శకత కోసమే 2005లో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ పి.వి. శ్రీనివాస్ రావు అధికారులకు సూచించారు.శుక్రవారం మధ్యాహ్నం గద్వాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో పీఐవో, అపిలెట్ అధికారులకు చట్టం పట్ల నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు దేశాల భూపాల్, వైష్ణవి మేర్ల, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ , ఎస్పీ శ్రీనివాస్ రావులతో కలిసి ఆయన పాల్గొన్నారు.