MRP ధరలకే యూరియా అమ్మాలి: రామాంజనేయ రెడ్డి ఎరువుల దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే రైతులకు యూరియా అమ్మాలని విజిలెన్స్ ఏఓ ఎన్.రామాంజనేయ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన చెంచురాజుకండ్రిగ, SSB పేట, పిచ్చాటూరులోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ CI చంద్రశేఖర్తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు రికార్డులను పరిశీలించారు. మోసాలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.