గుడివాడలో హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా విదించిన టౌన్ సీఐ శ్రీనివాస్ స్తానిక గుడివాడలోని నాగవరప్పాడు వీకేఆర్ కళాశాల వద్దవన్ టౌన్ సీఐ శ్రీనివాస్ అధ్వర్యంలో సోమవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో మరొసారి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల పత్రాలను పరిశీలించి, పెండింగ్ చలానాలపై చర్యలు తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానాలు విధించారు. అలాగె రహదారులపై వేగాన్ని నియంత్రించి, ప్రమాద సూచికలను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని వాహనదారులకు సూచించారు.