బుధవారం రోజున పట్టణంలోని దుర్గామాత మండపం వద్ద అమ్మవారికి పాయసం చేస్తున్న తరుణంలో బెల్లం పానకం చేస్తుండగా ఓ అంబర్ ప్యాకెట్ బయటపడింది దాన్ని విప్పి చూడగా నిషేధిత పొగాకు సైతం కూడా ఉంది బెల్లంలో ఈ రకంగా రావడంతో భవాని మాలధారణ భక్తులు ఆ పానకాన్ని డ్రైనేజీలో పారబోసి మున్సిపల్ కమిషనర్ కు సమాచారం అందించారు వెంటనే సంబంధిత నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని కోరారు