ప్రకాశం జిల్లా తర్లపాడు మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం వెనకవైపు ఉన్న విద్యుత్ స్తంభం వద్ద గురువారం రాత్రి ఒక్కసారి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఆ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు.