Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: కొర్రాయిగేటు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొన్న ఐచర్ వ్యాన్,క్యాబిన్ లోఇరుక్కున్న డ్రైవర్ కు తీవ్ర గాయాలు

Srikakulam, Srikakulam | Sep 6, 2025
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొర్రాయి గేటు సమీప జాతీయ రహదారి వంతెనపై వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని శనివారం రాత్రి వెనుక నుంచి అతి వేగంగా ఐచర్ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐచర్ వాన్ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుని తీవ్రగాయాలు పాలయ్యాడు. విషయం తెలుసుకున్న 108, 1033 అంబులెన్స్ ల సిబ్బంది, హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ను అతి కష్టంగా బయటకి తీసి హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us