అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ నేలపాలెం గ్రామానికి చెందిన నిండు గర్భిణిని రహదారి సౌకర్యం లేక డోలిమోత ద్వారా తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం ఉదయం 7 గంటల సమయంలో గ్రామస్తులు ఇచ్చిన వీడియో సమాచారం మేరకు నేలపాలెం గ్రామానికి చెందిన సిరగం చిన్నమ్మి పురిటి నొప్పులు రావడంతో లుంగపర్తి పీహెచ్సీకి తరలించడానికి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆసుపత్రికి వెళ్లే దారిలో కొండలు గుట్టల రహదారిలో డోలిమోత ద్వారా మోసుకొని మధ్యలో వాగును దాటుకొని లుంగపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నామని, ఇప్పటికైనా అధికారులు అందించాలన్నారు.