మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో భారీ వర్షాలు వరద ఉధృతికి నార్సింగ్ - పెద్ద శంకరంపేట్ రహదారిలోని కొట్టుకుపోయిన దానంపేట వద్ద ఆర్ అండ్ బి రోడ్డు దెబ్బతిన్న రోడ్లు కల్వర్టులు, క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు కల్వర్టులు వంతెనలు దెబ్బతిన్న వాటిని ప్రస్తుతం తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి రవాణా ను పునరుద్ధరించే దిశగా ముందుకు పోతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలు నష్టాలపై సహాయక చర్యలు ముమ్మరం చేస్తూ ఆదుకుంటుందని వివరించారు.