అంబర్పేటలో కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఓట్ల చోరీకి నిరసనగా శనివారం మధ్యాహ్నం భారీ ర్యాలీని నిర్వహించారు. పూలే విగ్రహం నుంచి పటేల్ నగర్ వరకు ఈ ర్యాలీని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ హనుమంతరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు అలం ఖాన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.