కరీంనగర్ పట్టణం కోతిరాంపూర్ లోని పోచమ్మ కమాన్ వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కమాన్ వైపు నుండి కోతిరాంపూర్ వైపు వెళ్తున్న ఓ కారును ఓవర్ టెక్ చేశారని ఒక వర్గం.. నడి రోడ్డు పై వెళ్తున్న తమ కారుకు బైక్ తో వచ్చి అడ్డంగా బైక్ పెట్టారని మరో వర్గం ఆరోపణలు చేసుకుంటూ దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుతు దాడి చేస్తే..మరో వర్గం కారు అద్దలను ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు. ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలింపు. కాగా సంఘటన స్థలంలో ఘర్షణ జరిగే సమయంలో 200 మందికి పైగా గుమ్మి గుడారు.