సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రి కుంట నుండి కలెక్టరేట్ వరకు తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ప్రతినెల పారితోషకాలు వేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించగా ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని అదరపు పనులు అదనపు పారితోషకం ఇవ్వాలని ఆదివారం సెలవు ఇవ్వాలని పండుగ సెలవులు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ లు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు.