శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా శ్రావణమాసం ఆఖరి శనివారాన్ని పురస్కరించుకొని ఆలయాలు కిక్కిరిశాయి. కదిరిలోని ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, నల్ల చెరువులోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయాల్లో శనివారం స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు జరిపారు.