ఇత్తడి సామాన్లతో బందరులో బొజ్జ గణపయ్య బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇత్తడి సామాన్లతో తయారు చేసిన గణనాథుడు స్తానిక మచిలీపట్నం వాసులను ఎంతగానో ఆకర్షిస్తున్నాడు. స్థానిక సిటీ కేబుల్ ఆఫీస్ వద్ద నివశిస్తున్న గోళ్ల ఝాన్సీ గత 27 ఏళ్లుగా వినాయక చవితిన ఒకొక్క వెరైటీతో గణనాథుల విగ్రహాన్ని తయారు చేసి ప్రత్యేక పూజలుచేస్తున్నారు. ఈ సంవత్సరం ఇత్తడి ప్లేట్లు, గిన్నెలు,రూ.10, రూ.20 కాయిన్స్ తో ఎంతో ఆకర్షణీయంగా గణనాథుడిని రూపొందించి తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.