యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో త్రిబుల్ ఆర్ రైతుల సమస్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ రైతులు తొక్కని గడపలేదని రాజగోపాల్ రెడ్డి గట్టివాడు కొట్లాడుతాడని అభిప్రాయం మీకు ఉందన్నారు. గతంలో మునుగోడు నియోజకవర్గానికి నిధులు రాకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ల దగ్గర పెట్టానని అన్నారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు.