ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా కూలిపోయిన ఇండ్లను అధికారులు చేపట్టిన సర్వేను బాన్సువాడ పట్టణ కేంద్రంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాన్సువాడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆయన పర్యటించి ఇండ్ల వివరాలను పరిశీలించారు. వర్షాల మూలంగా దెబ్బతిన్న ఇండ్లకు తాత్కాలిక నష్టపరిహారం అందించడంతోపాటు ఇందిరమ్మండ్లు మంజూరు చేస్తామని కూలిపోయిన స్తంభాలు రోడ్లను మరమ్మతు చేయడానికి అధికారుల చేత సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సర్వే పూర్తికాగానే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.