ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద గురువారం మధ్యాహ్నం BRSV రాష్ట్ర కార్యదర్శి శీను నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందని మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం గ్రూపు 1 పరీక్షలు రద్దుచేసి ఈ స్కాంకు కారకుడైన వారిని అరెస్టు చేసి వారి ఉద్యోగం తొలగించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు.