భీమిలిలోఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమం అనంతరం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీను మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రైతులకు మోసం చేస్తూనే ఉంది. రాష్ట్రంలో ఏ సమస్యను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అని హేళన చేశారు. మజ్జి శ్రీను మాట్లాడుతూ రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు పైన పోరాటం చేస్తున్నాం. రైతులు పడుతున్న ఇబ్బందులు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.